ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Weather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department officers) తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు(Heavy Rains) పడే ఛాన్స్​ ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడొచ్చు.

    వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాన పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమొదురు వానలు పడుతాయి. హైదరాబాద్(Hyderabad) సాయంత్రం – రాత్రి సమయంలో తేలికపాటి – మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...