అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఆదివారం పలు జిల్లాల్లో ఒక్కసారిగా వర్షాలు పడటంతో ఆరబెట్టిన ధాన్యం, మక్కలు తడిసిపోయాయి.
తెలంగాణలో పది రోజులుగా వర్షాలు లేవు. అక్కడక్కడ జల్లులు కురిసిన భారీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు పంట కోతలు చేపడుతున్నారు. వడ్లు, మొక్కజొన్న ఆరబోస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడింది. సోమవారం సైతం పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (Moderate Rains) కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది.
Weather Updates | ఆ జిల్లాల్లో..
వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ములుగు, వరంగల్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు కురుస్తాయి.
Weather Updates | ప్రారంభం కాని కొనుగోళ్లు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వరి కోతలు జోరుగా సాగున్నాయి. ఇప్పటికే రైతులు (Farmers) వడ్లను ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే ధాన్యం కొనుగోళ్లు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధులు, నాయకులు కొన్ని చోట్లు కేంద్రాలను ప్రారంభించినా.. ధాన్యం తూకాలు మాత్రం చేపట్టడం లేదు. రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం (Paddy) కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.