Weather Updates
Weather Updates | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

తెలంగాణలో గురువారం ఉదయం నుంచి వేడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయి. గద్వాల్​, వనపర్తి, నారాయణపేట్​, మహబూబ్​నగర్​, వికారాబాద్​, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్​కర్నూల్​, మెదక్​, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

నగరంలో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉండవు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి పూట అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. అయితే పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Weather Updates | మహానగరం అతలాకుతలం

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి కుండపోత వాన కురవడంతో మహా నగరం చివురటాకుల వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మియాపూర్‌లో 9.7.. లింగంపల్లిలో 8.2, HCUలో 8.5, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

Weather Updates | యువకుడి మృతి

బల్కంపేట్‌ (Balkampet)లోని అండర్‌పాస్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో షరపుద్దీన్ అనే యువకుడు కొట్టుకుపోయాడు. బైక్​పై అండర్​పాస్​ నుంచి వెళ్తుండగా వరదకు కొట్టుకుపోయాడు. ఆయనను స్థానికులు కాపాడేందుకు యత్నించినా అప్పటికే మృతి చెందాడు.