అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని ప్రలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనం (LPA)గా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
Rain Alert | ఆ జిల్లాల్లో..
రాష్ట్రంలోని మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నం తర్వాత వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో చెదురు ముదురు వర్షాలు పడతాయి.
Rain Alert | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad)లో మధ్యాహ్నం తర్వాత మోస్తరు వర్షాలు కురుస్తాయి. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Rain Alert | దంచి కొట్టిన వాన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం వాన దంచి కొట్టింది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు ఉదృతంగా పారుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 106.8 మిల్లీమీటర్లతో వర్షపాతం నమోదయింది. కొత్తగూడెం జిల్లా పెంట్లంలో 81.3, మణుగూరులో 79.5, వనపర్తి జిల్లా ఘన్పూర్లో 72.0, ములుగు జిల్లా ధర్మవరంలో 71.3, ఖమ్మం జిల్లా కల్లూరులో 71.0, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 70.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.