అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లింగాపూర్ వాగు (Lingapur vagu) ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇందల్వాయి నుంచి ధర్పల్లి (Dharpally) వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు. లింగాపూర్ వాగుపై ఇప్పటికే వంతెన నిర్మాణం (Bridge construction) జరుగుతోంది. దీంతో వంతెన పక్కనే తాత్కాలికంగా రోడ్డు వేశారు.
Indalwai | వాగులో పడ్డ ట్రాక్టర్..
భారీ వర్షాలకు తాత్కాలిక రోడ్డు పైనుంచి వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రోడ్డు తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే వాగులోనుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడిపోయింది. అయితే ట్రాక్టర్ డ్రైవర్ (Tractor driver) సురక్షితంగా బయటపడ్డాడు.
వెంటనే సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు (Indalwai Police) సంఘటనా స్థలానికి వెళ్లి.. వాహనాలు ఆ దారిన వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఇందల్వాయి నుండి ధర్పల్లి, సిరికొండ (Sirikonda), భీమ్గల్ వెళ్లే వాహనదారులు తిర్మన్ పల్లి(Tirmanpally) నుండి మల్లాపూర్ (mallapur) లోలం మీదుగా వెళ్లాలని, హైదరాబాద్ (Hyderabad) నుండి వెళ్లేవారు గన్నారం (gannaram) నుండి నల్లవెల్లి గౌరారం మీదుగా ధర్పల్లి వెళ్లాల్సిందిగా పోలీసులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాత్కాలిక రోడ్డుపై నుంచి వెళ్తూ వాగులో పడ్డ ట్రాక్టర్