అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉవ్వెత్తున ఎగిసిపడిన వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.
జల ప్రళయం సృష్టించిన విళయం అంతా ఇంతా కాదు. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. పొలాల్లో వరదలు తీసుకొచ్చిన ఇసుక మేటలు, తెగిన రోడ్లు, కూలిన ఇళ్లు జల Flood విపత్తుకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
జల ప్రళయ విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉత్తర తెలంగాణపైకి మరో విపత్తు ముంచుకు రాబోతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
రానున్న 12 నుంచి 36 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
తాజాగా ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు మళ్లీ ముప్పు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
RAIN ALERT | ఈ నెలలోనూ భారీగా వర్షాలు
సెప్టెంబరులోనూ దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
ఏటా సెప్టెంబరులో సాధారణంగా 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది. కానీ, ఈసారి సాధారణం కంటే 109 శాతం ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ చెప్పుకొచ్చింది.
ఇక తూర్పు భారత్, దక్షిణ భారత్, ఈశాన్య భారత్, వాయవ్య భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవొచ్చని ఐఎండీ IMD పేర్కొంది.
ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. అంటే సాధారణ, అంతకు మించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.