అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం వర్షాలు కురిసే rian alert telangana అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది.
మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో చెదురుముదురు వానలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. హైదరాబాద్(hyderabad city)లో సాయంత్రం వాన పడే అవకాశం ఉంది. కాగా.. బుధవారం అర్ధరాత్రి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.