Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Railway | రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తి.. పరుగులు తీసిన రాయలసీమ ఎక్స్​ప్రెస్

Kamareddy Railway | రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తి.. పరుగులు తీసిన రాయలసీమ ఎక్స్​ప్రెస్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway | భారీవర్షాల కారణంగా రైల్వే ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. తలమడ్ల (talamadla) వద్ద రైల్వేట్రాక్ (Railway Track)​ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను రెండు,మూడు రోజులుగా నిలిపివేశారు. ఎట్టకేలకు రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన  మరమ్మతులు చేపట్టి పనులను పూర్తి చేశారు.

రైలు సౌకర్యం లేకపోవడంతో రోడ్డుమార్గం గుండా వెళ్లాలనుకున్న ప్రయాణికులకు జాతీయరహదారిపై మూడు చోట్ల రోడ్లు దెబ్బతినడంతో అలా కూడా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండుమూడురోజులుగా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లలేదు.

Kamareddy Railway | ఎట్టకేలకు రైల్వే మరమ్మతులు పూర్తి..

తలమడ్ల రైల్వే ట్రాక్​ను 36 గంటలుగా మరమ్మతులు చేపట్టారు. ఎట్టకేలకు మరమ్మతులు పూర్తి కావడంతో ముందుగా డెమో రైలుతో ట్రాక్​ను చెక్ చేశారు. మూడు రోజులుగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలను శనివారం ప్రారంభించారు.

తలమడ్ల స్టేషన్ మీదుగా శనివారం రాయలసీమ ఎక్స్​ప్రెస్ (Rayalaseema Express)​ నిజామాబాద్​కు వెళ్లింది. దీంతో కామారెడ్డి మీదుగా హైదరాబాద్ (hyderabad), మహారాష్ట్ర(Maharashtra), తిరుపతి (Tirupathi) ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనం కలిగినట్టయింది. ప్రస్తుతం జాతీయ రహదారి మరమ్మతులు జోరుగా కొనసాగుతున్నాయి.

పూర్తయిన రైల్వే ట్రాక్​ పనులు

Must Read
Related News