అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains | వరంగల్ (Warangal) జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. సోమవారం నగరంలో వాన దంచికొట్టింది. రాత్రి పూట భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ (Warangal Railway Station) నీట మునిగింది. భారీ వరద రావడంతో రైల్వే ట్రాక్ మొత్తం జలమయమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92.9 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Heavy Rains | డిపోలకే పరిమితమైన బస్సులు
భారీ వర్షం కురవడంతో వరంగల్ నగరం జలమయమైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. రోడ్లు చెరువులను తలపించడంతో మంగళవారం ఉదయం కూడా బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. నగరంలోని రంగశాయిపేట, కాశీబుగ్గ, కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
Heavy Rains | పొంగి పొర్లుతున్న వాగులు
ఉమ్మడి వరంగల్ రెండు రోజులుగా వర్షాలు పడుతుండటంతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. వర్ధన్నపేట (Wardhannapet) ఆకేరువాగు పొంగి ప్రవహిస్తోంది. ఎల్గూరు రైల్వే స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం- ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య ఉన్న అండర్ పాస్ నీటితో నిండిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయం సైతం నీట మునిగింది.
భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి నీరు రావడంతో అవస్థలు పడ్డారు.
#Warangal Railway station
YT link 👇 https://t.co/Y1KkxFr5Qg pic.twitter.com/Ms0bT4H69g
— Hi Warangal (@HiWarangal) August 12, 2025