ePaper
More
    HomeజాతీయంIndian Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధం

    Indian Railway | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 8 గంటల ముందే ఛార్ట్ సిద్ధం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Railway : రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రాబోతోంది. నూతన పద్ధతిని తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధం అవుతోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే ప్రధాన చర్యలో భాగంగా భారతీయ రైల్వే ఎనిమిది గంటల ముందే రిజర్వేషన్ ఛార్టు(reservation charts)ను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మార్పుతో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది.

    Indian Railway : ఎనిమిది గంటల ముందు ఛార్టు

    ఇండియన్​ రైల్వే తన టికెటింగ్, రిజర్వేషన్ ప్రక్రియను పునరుద్ధరించబోతోంది. ఇందులో రైలు ఛార్టుల తయారీ, ఇతర చర్యలు ఉన్నాయి. కొత్త విధానంలో రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే ప్రయాణికుల ఛార్టును ప్రకటిస్తారు. వెయిటింగ్ జాబితాలో ఉన్న ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు చెబుతున్నారు.

    Indian Railway : రైల్వే మోడ్రన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్

    2025 డిసెంబరు నాటికి రైల్వే మోడ్రన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) Railway Modern Passenger Reservation System (PRS) అందుబాటులోకి రానుంది. దీనిని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్​ఏఎస్) Centre for Railway Information Systems (CRAS) చేపడుతోంది. కొత్త పీఆర్ఎస్​ను అందుబాటులోకి తీసుకొస్తే.. ప్రతి నిమిషానికి 1.5 లక్షల టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న (నిమిషానికి 32,000 టికెట్లు) సామర్థ్యం కంటే సుమారు అయిదింతలు ఎక్కువ.

    టికెట్ ఎంక్వైరీ వ్యవస్థ(ticket enquiry system) ను కూడా అప్ గ్రేడ్ చేయనున్నారు. ఇలా అప్​గ్రేడ్​ అయితే.. ఎంక్వైరీ కెపాసిటీ నిమిషానికి నాలుగు లక్షల నుంచి 40 లక్షలకు పెరుగుతుంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...