ePaper
More
    HomeజాతీయంRailway Passengers | రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇక బోగీల్లో సీసీ కెమెరాలు

    Railway Passengers | రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇక బోగీల్లో సీసీ కెమెరాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | దేశవ్యాప్తంగా రవాణా రంగంలో రైల్వేలది కీలక పాత్ర. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు రైళ్లలోనే రాకపోకలు సాగిస్తారు. భారతీయ రైల్వే(Indian Railways) నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలు చేరవేస్తుంది.

    ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని రైల్వేశాఖ(Railway Department) పలు కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే వేగవంతమైన ప్రయాణం కోసం వందే భారత్​ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే రైళ్లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రతపై ఎప్పటి నుంచే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా అన్ని బోగీలలో సీసీ కెమెరాలు(CCTV Cameras) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    Railway Passengers | ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా..

    ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అన్ని కోచ్​లు డోర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రైళ్లలో దొంగల బెడద అధికంగా ఉంది. ఇటీవల రైలు దోపిడీ(Train Robbery) ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దారి మధ్యలో రైళ్లను ఆపి దొంగలు ప్రయాణికులను దోపిడీ చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే రైల్వేశాఖ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Railway Passengers | రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఎమ‌ర్జెన్సీ కోటా నిబంధ‌న‌ల్లో మార్పులు

    Railway Passengers | అక్కడ సక్సెస్​ కావడంతో

    రైల్వే కోచ్‌(Railway Coach)లకు సీసీ కెమెరాల ఏర్పాటును నార్తరన్​ రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 74 వేల కోచ్‌లు, 15 వేల లోకో కోచ్‌లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) ఆమోదం తెలిపినట్లు సమాచారం.

    Railway Passengers | ఆధునిక సీసీ కెమెరాలు..

    ప్రతి కోచ్‌ ఎంట్రీల వద్ద సీసీ కెమెరాలు అమర్చనున్నారు. లోకో కోచ్‌లకు ద్వారాలతో పాటు ముందు, వెనుకతో కలిపి ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. చీకట్లో సైతం వీడియో మంచిగా వచ్చేలా ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

    READ ALSO  Vice President Dhankhar | ఏ శ‌క్తి కూడా భార‌త్‌ను నియంత్రించ‌లేదు.. ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌

    Latest articles

    Supreme Court | ఏపీ, తెలంగాణ‌కు సుప్రీంకోర్టు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పిటిష‌న్ల కొట్టివేత‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Supreme Court | తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ...

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణకు (Telangana) జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో...

    Central Government | 25 ఓటీటీలు, సైట్ల‌పై నిషేధం.. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Government | అశ్లీష కంటెంట్‌ను ప్ర‌చారం చేస్తున్న ఓటీటీ(OTT)లు, వెబ్‌సైట్ల‌(Websites)పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. 25...

    Bihar Former CM | తేజ‌స్వియాద‌వ్ ప్రాణాల‌కు ముప్పు.. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bihar Former CM | బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, లాలూసింగ్ యాద‌వ్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి(Bihar Former CM...

    More like this