HomeతెలంగాణRailway gate | రైల్వేగేట్‌ మరో రెండురోజులు మూసివేత

Railway gate | రైల్వేగేట్‌ మరో రెండురోజులు మూసివేత

- Advertisement -

అక్షరటుడే, డిచ్‌పల్లి: Railway gate | మండలంలోని ఘన్‌పూర్‌–డిచ్‌పల్లి (Ghanpur-Dichpally) మధ్య రైల్వేగేట్‌ మరో రెండురోజులు మూసి ఉంచనున్నారు. పట్టాల మరమ్మతులు పూర్తి కానందున ఈనెల 26 సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేట్‌ మూసి ఉంచనున్నట్లు రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Railway gate | సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బందులు..

మండలంలోని ఘన్​పూర్-డిచ్​పల్లి మధ్య రైల్వేగేట్​ను మొదట ఈనెల 21వ తేదీ నుంచి 24 తేదీ వరకు గేట్​ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు డిచ్​పల్లి (Dichpally) పంచాయతీ కార్యదర్శి రమేశ్ (Panchayat Secretary Ramesh) గత​ సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో వాహనదారులు 21వ తేదీ నుంచి ఇతర మార్గాల ద్వారా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కానీ పనులు పూర్తికాకపోవడంతో మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు.