అక్షరటుడు, వెబ్‌డెస్క్ : Nanded – Tirupati Train | నాందేడ్ – తిరుపతి మధ్య నడుస్తున్న రైలుకు ఆర్మూర్ (Armoor)లో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది తిరుపతి (Tirupati) క్షేత్రానికి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం నేరుగా ఆర్మూర్ నుంచి రైలు సౌకర్యం లేకపోవడంతో వీరు నిజామాబాద్ (Nizamabad) వెళ్లి ట్రైన్ ఎక్కుతున్నారు.
ఆర్మూర్లో రైల్వే స్టేషన్ ఉండడంతో నాందేడ్–తిరుపతి రైలుకు హాల్టింగ్ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. నాందేడ్–తిరుపతి రైలు (07015) వారానికి ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఆ రైలును ఆర్మూరు మీదుగా నడిపించి హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ రైలుకు ఆర్మూర్లో హాల్టింగ్ కల్పించాలని శనివారం సాయంత్రం ఆరు గంటలకు రైలు రోకో (Rail Rokho) నిర్వహించనున్నారు. ఆర్మూర్ డివిజన్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని నాయకులు కోరారు. కాగా.. ప్రస్తుతం ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్లలో ఆగుతుంది.