అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టి జూదరులను పట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో శనివారం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
Police Raids : రెండు చోట్ల..
సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో పోలీసులు దాడులు చేపట్టారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి (Adlur Yellareddy) గ్రామంలో నిర్వహించిన పోలీసుల దాడుల్లో 9 మంది జూదరులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.34,940 నగదు, 9 మొబైల్ ఫోన్లు, 6 బైకులు,1 కారు స్వాధీనం చేసుకున్నారు.
తాడ్వాయి మండలం (Tadwai mandal) దేమికలాన్ గ్రామ శివారులో ఇద్దరు జూదరులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.1,700 నగదు, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు దాడులలో ఒక చోట రాజకీయ నాయకులు (political leaders) ఉన్నట్లు సమాచారం. వీరు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టిబడినట్టుగా తెలుస్తోంది.