ePaper
More
    Homeక్రైంMoneylenders | వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు.. పది మందిపై కేసులు

    Moneylenders | వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు.. పది మందిపై కేసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylenders | వడ్డీ వ్యాపారులు (Moneylenders) ప్రజలను వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. అధిక వడ్డీలతో (Interest Rates) ప్రజల నడ్డీ విరుస్తున్నారు.

    వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక గతంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సిరిసిల్ల (Siricilla) జిల్లావ్యాప్తంగా గురువారం వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేశారు.

    జిల్లావ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ చేస్తున్న వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు సిరిసిల్ల ఎస్పీ మహేశ్​ బి గీతే (SP Mahesh B Geete) తెలిపారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ గల డాక్యుమెంట్లను, తాకట్టు పెట్టుకున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మనీలాడరింగ్ యాక్ట్ ప్రకారం పది మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు.

    Moneylenders | అడ్డగోలుగా వడ్డీ వసూలు

    రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులు అడ్డగోలుగా మిత్తి వసూలు చేస్తున్నారు. రూ.మూడు నుంచి రూ.10 వరకు వడ్డీ తీసుకుంటున్న వారు ఉన్నారు. అత్యవసరం అయితే అధిక వడ్డీ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్​లకు పాల్పడే వారు అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని.. అవి కట్టలేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. కొంత మంది అప్పుల బాధతో తనువు చాలిస్తున్నారు. గతంలో చాలా మంది ఇలా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.

    Moneylenders | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో సైతం

    ఉమ్మడి నిజామాబాద్(Nizamabad)​ జిల్లాలో సైతం వడ్డీ వ్యాపారులు భారీగానే ఉన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ కానిస్టేబుల్ (Constable)​ సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఇటీవల సస్పెండ్​ చేశారు. గతంలో నిజామాబాద్​, కామారెడ్డి పోలీసులు సైతం వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అయినా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...