HomeUncategorizedShashi Tharoor | రాహుల్ ప్ర‌శ్న‌లు తీవ్ర‌మైన‌వే.. ఈసీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న‌ శ‌శిథరూర్

Shashi Tharoor | రాహుల్ ప్ర‌శ్న‌లు తీవ్ర‌మైన‌వే.. ఈసీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న‌ శ‌శిథరూర్

- Advertisement -

అక్షర టుడే, వెబ్ డెస్క్ : Shashi Tharoor | భార‌త ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆ పార్టీ సీనియ‌ర్ ఎంపీ శశి థరూర్ (Congress MP Shashi Tharoor) స‌మ‌ర్థించారు. భారత ఎన్నికల కమిషన్(Election Commission of India)పై రాహుల్ గాంధీ చేసిన ‘ఓటు చోరీ’ ఆరోపణలకు ఆయ‌న మద్దతు ఇచ్చారు.

“అవి నిజంగానే తీవ్రమైన ప్రశ్నలు. అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాలను ప‌రిర‌క్షించాల్సిన అవ‌సర‌ముంద‌ని” స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్రవారం ‘X’లో ఓ పోస్టు పెట్టారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించిన అవకతవకలపై వెల్ల‌డిస్తున్న వీడియోను థరూర్ షేర్ చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “ఇవి అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల కోసం పరిష్కరించాల్సిన తీవ్రమైన ప్రశ్నలు. అసమర్థత, నిర్లక్ష్యం వ‌ల్ల క‌లిగే ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ ద్వారా ప్ర‌జాస్వామ్య విశ్వసనీయతను నాశనం చేయడానికి య‌త్నించ‌డాన్ని అంగీకరించ‌కూడ‌దు. దీనిపై ఈసీ అత్యవసరంగా చర్య తీసుకోవాలి & దేశానికి స‌రైన జ‌వాబు ఇవ్వాల‌ని” పోస్టు చేశారు.

Shashi Tharoor | రాహుల్‌గా మ‌ద్ద‌తుగా..

కొంత‌కాలంగా పార్టీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్న శ‌శిథ‌రూర్.. తాజాగా కాంగ్రెస్ నేత‌కు మ‌ద్దతుగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఆర్నెళ్లుగా పార్టీ నాయకత్వానికి వ్య‌తిరేకంగా ఆయ‌న గ‌ళ‌మెత్తుతున్నారు. ఎమ‌ర్జెన్సీపై వ్యాఖ్య‌లు చేయ‌డం, ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) స‌మ‌యంలో మోదీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ‌సించ‌డం, కేంద్రం విదేశాల‌కు పంపించిన అఖిల‌ప‌క్ష పార్టీ ఎంపీల బృందానికి నాయ‌క‌త్వం వ‌హించ‌డం ద్వారా ఆయ‌న కాంగ్రెస్‌కు దూర‌మ‌వుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, థరూర్ తాజా వ్యాఖ్యలు ఆయ‌న స్వరంలో మార్పును కూడా సూచిస్తున్నాయి.

Shashi Tharoor | ఓట్లు చోరీ చేస్తున్నార‌న్న రాహుల్

ఎన్నిక‌ల సంఘంపై రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బీజేపీతో క‌లిసి ఈసీ ఓట్ల చోరీకి పాల్ప‌డుతోందని ఆరోప‌ణ‌లు చేశారు. విస్తృతమైన ఎన్నికల రిగ్గింగ్‌కు ఖచ్చితమైన ఆధారాలున్నాయ‌ని పేర్కొంటూ మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ను (Maharashtra and Karnataka elections) ఉదాహ‌రించారు. ఎన్నికల ప్రక్రియను రంగస్థలంగా మార్చి ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని, ఫలితాలను తారుమారు చేసిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓటర్ల జాబితాలలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కర్ణాటకలోని మహాదేవ్ పుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో (Mahadevpura Assembly segment) ఆరోపణలకు కేంద్రంగా ఉంది, ఇక్కడ బీజేపీ 1,14,046 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిందని, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానాన్ని 32,707 ఓట్ల తేడాతో గెలుచుకుందని ఆరోపించారు.