అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు.
తన ప్రేయసి హరిణి రెడ్డి(Harini Reddy)తో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్ట్ 17) హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక(Engagement Ceremony) ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాహుల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Rahul Sipligunj | కొత్త అధ్యాయం..
నిశ్చితార్థ వేడుకలో రాహుల్ పాస్టెల్ లావెండర్ కలర్ షేర్వానీలో రాయల్ లుక్ తో కనిపించగా, హరిణి రెడ్డి ఆరెంజ్ కలర్ లెహంగా ధరిచి అందంగా మెరిసిపోయింది. అభిమానులు, నెటిజన్లు ఈ జంటను “చూడముచ్చటగా ఉంది” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.హరిణి రెడ్డి గురించి అధికారికంగా సమాచారం వెలువడకపోయినా, ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో లిస్టులో ఆమె ఉన్నారు. ఆమెకు యాంకర్ విష్ణుప్రియ, సింగర్ నోయెల్, అరియానా వంటి పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతుండడం గమనార్హం.
రాహుల్ ‘నాటు నాటు’ పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ గీతానికి ఆస్కార్ రావడంతో దేశం గర్వించిందంటే అతిశయోక్తి కాదు. 2023లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్‌కి రూ.10 లక్షల ప్రోత్సాహకంగా ఇవ్వగా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటి రూపాయల చెక్ కూడా అందజేశారు. ప్రస్తుతం రాహుల్ పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే నిశ్చితార్థం అనంతరం, త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని అభిమానులు ఆశాభావంగా ఎదురుచూస్తున్నారు. పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj)కు, హరిణి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.