Homeక్రీడలుKL Rahul | తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో రాహుల్‌ టెస్ట్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా...

KL Rahul | తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో రాహుల్‌ టెస్ట్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KL Rahul | అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ గర్జించాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్ట్ సెంచరీ బాదిన రాహుల్, తన ఆటతో అభిమానులను అలరించారు.

టెస్టుల్లో ఇది అతని 11వ శతకం కాగా.. భారత గడ్డపై రెండవ సెంచరీ కావడం విశేషం. భారత్ ఇన్నింగ్స్ రెండో రోజున 67 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్ (KL Rahul) తన సెంచరీని పూర్తి చేశారు. 190 బంతుల్లో 12 బౌండరీలతో శతకాన్ని నమోదు చేసిన రాహుల్, క్రికెట్ ప్రేమికులకు తీపి క్షణాలు అందించారు.

KL Rahul | రాహుల్ శ‌తకం..

చివరి సారి రాహుల్ భారత్‌లో 2016 డిసెంబర్‌లో చెన్నైలో ఇంగ్లండ్‌పై సెంచరీ బాదారు. దాని తర్వాత దేశీయ గడ్డపై అతనికి సెంచరీ దక్కలేదు. మొత్తం 3,211 రోజుల విరామం తర్వాత వచ్చిన ఈ సెంచరీ, రాహుల్‌కి మళ్లీ టెస్ట్ జట్టులో పట్టు సాధించే మార్గం కావొచ్చన్న భావనను కలిగిస్తోంది. కెప్టెన్ శుభమన్ గిల్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీమిండియా (Team India) భారీ స్కోరు సాధించ‌డంలో భాగం అయ్యాడు. సెంచరీ దిశగా సాగుతున్న గిల్, చేసిన చిన్న త‌ప్పిదానికి ఔట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధృవ్ జురేల్ ఉన్నాడు. రాహుల్, జురేల్ జోడీ ఎన్ని ప‌రుగులు చేస్తారా అన్న దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉంది.

కేఎల్ రాహుల్ శతకంతో భారత్ తొలి టెస్ట్‌లో ప‌ట్టు బిగించింది.. పిచ్‌పై బౌన్స్ ఉన్నా, స్పిన్ పెద్దగా అనుకూలించ‌క‌పోవ‌డంతో భారత్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. రాహుల్ ఇన్నింగ్స్ వల్లే భారత్ ప్రత్యర్థి వెస్టిండీస్‌పై తొలి టెస్టులో పట్టు సాధించే దిశగా వెళ్తోంది. ప్ర‌స్తుతం భార‌త్ 56 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్ (36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్ (43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ Siraj నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు , వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు.