ePaper
More
    HomeజాతీయంRahul Gandhi | రాహుల్ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం.. కాంగ్రెస్ నేత‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

    Rahul Gandhi | రాహుల్ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం.. కాంగ్రెస్ నేత‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టిన కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ శుక్ర‌వారం తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డింది. రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) భార‌త రాజ్యాంగం అన్నా, ప్ర‌జాస్వామ్యం అన్నా గౌర‌వించ‌ర‌ని విమ‌ర్శించింది.

    ఇటీవ‌ల ఎర్ర‌కోట‌లో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వాలకు రాలేదని, ఇప్పుడు రాజ్యంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వికి సంబంధించిన ప్ర‌మాణ స్వీకారానికి రాలేద‌ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ (CP Radhakrishnan) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 67 ఏళ్ల రాధాకృష్ణన్​తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగ్‌దీప్ ధన్‌ఖడ్‌, వెంకయ్య నాయుడు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

    Rahul Gandhi | ప్ర‌జా జీవితానికి అన‌ర్హుడు..

    ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నేత‌లు (Congress Leaders) రాలేదు. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ గైర్హాజరు కావ‌డంపై బీజేపీ విమర్శలు గుప్పించింది, కాంగ్రెస్ నాయకుడు భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొంది. “రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని ద్వేషిస్తారు! భారత ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారు!” అని బీజేపీ నేత ప్ర‌దీప్ భండారి (BJP Leader Pradeep Bhandari) మండిప‌డ్డారు. “రాహుల్ గాంధీ అధికారిక ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు! ఇటీవ‌ల ఎర్రకోటలో భారత స్వాతంత్య్ర‌ వేడుకలను బహిష్కరించారు! భారతదేశ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని, రాజ్యాంగ ప్రతిష్ఠాత్మక వ్యక్తి ప్రమాణ స్వీకారాన్ని తృణీకరించే వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటానికి అర్హుడా?” అని ఆయన ‘X’లో ప్రశ్నించారు.

    Rahul Gandhi | విదేశాల‌కు వెళ్లే టైముంది కానీ..

    ప్రతిపక్ష నాయకుడి విదేశీ పర్యటనలను ప్రస్తావించిన భండారి.. రాహుల్ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. “రాహుల్ గాంధీకి మలేషియాలో సెలవులకు వెళ్లడానికి సమయం ఉంది, కానీ అధికారిక రాజ్యాంగ విధులకు మాత్రం స‌మ‌యం కాదు! రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం! రాహుల్ గాంధీ భారత రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు!” అని మండిప‌డ్డారు.

    More like this

    Nepal | నేపాల్ లో భారత టూరిస్టులపై దాడి.. ఆలస్యంగా వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకి పోయిన నేపాల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే, ఇటీవల...

    Mohan Bhagwat | భారత్ అంటే భయపడే సుంకాలు.. అమెరికా తీరును ఎండగట్టిన మోహన్ భగవత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat | భారతదేశం బలంగా అభివృద్ధి చెందితే తమకు ఏమి జరుగుతుందోనని అమెరికాకు...

    Stock Market | ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ పైపైకి.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....