అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gandhi | దేశంలో ఎన్నికల నిర్వహణపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో జరుగుతున్న లీగల్ కాన్క్లేవ్లో (Legal Conclave) శనివారం ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్లో తమకు ఒక్క సీటు రాకపోవడం ఏమిటన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలను ఎలా క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
Rahul Gandhi | మా దగ్గర ఆధారాలు ఉన్నాయి..
బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడడంపై తాము దృష్టి పెట్టామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. మొదట తమ దగ్గర ఆధారాలు లేవన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి మంచి సీట్లు వచ్చాయన్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు. దీనిపై తాము వివరాలు సేకరిస్తే సంచలన విషయాలు తెలిశాయన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నాటికి మహారాష్ట్రలో (Maharashtra) కోటి మంది ఓటర్లు పెరిగారని ఆయన ఆరోపించారు. ఆరు నెలలుగా ఆధారాలు సేకరించి తాను మాట్లాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఫేక్ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ఈసీ తమకు ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
Rahul Gandhi | ఈసీపై ఆరోపణలు
రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ (Parliament) ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈసీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ(BJP)కి మేలు చేయడమే లక్ష్యంగా ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లను నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. బీహార్ ఓటర్ జాబితా ముసాయిదా జాబితా విడుదలైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు పట్టించుకోవద్దని పేర్కొంది. పారదర్శకంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని అధికారులకు ఎన్నికల సంఘం సూచించింది.