HomeUncategorizedRahul Gandhi | రాహుల్‌కు చుక్కెదురు.. అమెరికాలో నిలదీసిన యువకుడు.. వీడియో వైరల్

Rahul Gandhi | రాహుల్‌కు చుక్కెదురు.. అమెరికాలో నిలదీసిన యువకుడు.. వీడియో వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rahul Gandhi | కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి Congress leader Rahul Gandhi చుక్కెదురైంది. గత నెలలో అమెరికా US పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అక్కడి జరిగిన ఓ సమావేశంలో ఆయనకు ఊహించని రీతిలో పరాభవం ఎదురైంది. ఏప్రిల్ 21న అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో Brown University నిర్వహించిన సక్సెనా సెంటర్ Saxena Center ఫర్ కంటెంపరరీ సౌత్ ఆసియా సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన కుల గణన caste census సహా అనేక అంశాల గురించి మాట్లాడారు. అయితే, ఓ సిక్కు యువకుడు లేచి వరుస ప్రశ్నలు గుప్పించడంతో రాహుల్ గాంధీ Rahul Gandhi ఖంగుతిన్నారు.

Rahul Gandhi | నిలదీసిన యువకుడు..

కేంద్ర ప్రభుత్వంపై central government రాహుల్ గాంధీ Rahul Gandhi అనేక ఆరోపణలు చేశారు. బీజేపీ హయాంలో BJP rule సిక్కులు తలపాగా, కడ ధరించడానికి కూడా అనుమతి ఉండదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఓ సిక్కు యువకుడు రాహుల్ గాంధీ Rahul Gandhi ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ‘‘బీజేపీ హయాంలో సిక్కులు తలపాగా, కడ ధరించడానికి అనుమతి ఉండదనే భయాన్ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని” రాహుల్ గాంధీని Rahul Gandhi సూటిగా నిలదీశారు. పైగా సిక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీయే Congress party అని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో Congress regime జరిగిన సిక్కుల ఊచకోతను ఉదాహరించారు. పైగా సిక్కు Sikhs వ్యతిరేకులను పార్టీలో కొనసాగిస్తున్న అంశాన్ని రాహుల్ ఎదుట లేవన్నారు. ” సజ్జన్కుమార్ లాంటి సిక్కు అల్లర్ల వ్యతిరేకులు వారెందరో ఇప్పటికీ కాంగ్రెస్లో ఎందుకు ఉన్నారని’’ ప్రశ్నించారు. “సజ్జన్ కుమార్ Sajjan Kumar లాగా 1984 అల్లర్ల నిందితులను కాంగ్రెస్ రక్షించింది. కాంగ్రెస్ సిక్కు వాక్ స్వేచ్ఛపై దాడి చేసింది” అని రాహుల్ గాంధీని బహిరంగంగా నిలదీశారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక కాంగ్రెస్ నేత బిక్కముఖం వేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.