అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల Bihar Assembly elections ఫలితాల results పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ Lok Sabha లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఫలితాలు ‘నిజంగా ఆశ్చర్యకరమైనవి’ అని పేర్కొన్నారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగక పోవడం వల్లే మహా ఘట్ బంధన్ విజయం సాధించలేక పోయిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచే నిష్పక్షపాత వైఖరి లేకుండా పోయిందన్నారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ఓటు వేసిన బీహార్ ప్రజలకు రాహుల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“బీహార్లో ఈ ఫలితం నిజంగా ఆశ్చర్యకరమైనది. ప్రారంభం నుంచే న్యాయంగా లేని ఎన్నికల్లో మనం విజయం సాధించలేకపోయాం..” అని రాహుల్ గాంధీ Xలో పోస్ట్ చేశారు.
“ఈ పోరాటం రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ ఫలితాన్ని లోతుగా సమీక్షిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తమ ప్రయత్నాలను మరింత ప్రభావవంతంగా పని చేస్తాయి..” అని ఆయన పేర్కొన్నారు.
Rahul Gandhi | 61 చోట్ల పోటీ చేస్తే ఆరు చోట్ల గెలుపు..
మహాకూటమికి చెందిన కాంగ్రెస్ బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. 61 సీట్లలో పోటీ చేయగా, కేవలం ఆరు సీట్లను మాత్రమే గెలుచుకుంది.
కాంగ్రెస్ బీహార్ యూనిట్ చీఫ్ రాజేష్ కుమార్ కూడా ఓడిపోయారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలముకుంది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా పార్టీ పనితీరుపై నిరాశ వ్యక్తం చేశారు.
Rahul Gandhi | పోరాటం కొనసాగుతుంది..
రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఖర్గే అన్నారు.
బీహార్ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని Xలో హిందీలో పోస్ట్ చేశారు.
“మీరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పాలనుకుంటున్నాను. మీరు మా గర్వం, గౌరవం, కీర్తి. మీ కృషి మా బలం. ప్రజలలో అవగాహన పెంచడంలో మేము ఏ అవకాశాన్నీ వదులుకోం..” అని ఖర్గే పేర్కొన్నారు.
