అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ఓటు చోరీ పేరిట రాహుల్ గాంధీ (Rahul Gandhi) డ్రామాలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో 11 ఏళ్లుగా సాగుతున్న సుపరిపాలనను ఓర్వలేక రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇటలీ (Italy) నుంచి వచ్చి గాంధీ పేరును చోరీ చేసింది సోనియా (Soniya) కుటుంబం కాదా అని ఆయన ప్రశ్నించారు.
Mla Dhanpal | కాళేశ్వరంపై సీఎం మౌనమేలా..?
సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం (Kaleshwaram) అతిపెద్ద కుంభకోణం అని గగ్గోలు చేసి.. ప్రస్తుతం దోషులను ఎందుకు శిక్షించడం లేదని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. కేసీఆర్ను (KCR) కాపాడటానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా ‘మార్వాడీ గో బ్యాక్’ (Marwadi Go Back) పేరిట అల్లర్లు జరిగితే కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. హిందువులను విడదీసే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. సెక్యులర్వాదులకు దమ్ముంటే ‘రోహింగ్యాల గో బ్యాక్’ అనే ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు.
Mla Dhanpal | ఓటు చోరీ అనడం సబబు కాదు..
ఓటు చోరీ గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma) పదేపదే మాట్లాడడం తగదని జాతీయ పసుపు బోర్డు (National Yellow Board) ఛైర్మన్ పల్లె గంగారెడ్డి (Palle Gangareddy) అన్నారు. ఓట్లు చోరీ జరిగితే నిరూపించాలని ఛాలెంజ్ చేశారు.
బంగ్లాదేశ్లో (Bangladesh) షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు చోరీ జరిగాయని చెప్పి ఆమెను ఎలాగైతే పదవి నుంచి తప్పించారో, అదే వ్యూహం రాహుల్ గాంధీ ఇక్కడ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.