అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi | లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ (Prime Minister Modi)పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా బెర్లిన్లోని ఓ స్కూల్లో మాట్లాడారు. ప్రధాని మోదీ విజన్ పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. మోదీ విధానాలతో ఏకీభవించని వారు దేశంలో లక్షలాదిగా ఉన్నారని చెప్పారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి కొనసాగుతుంతన్నారు. ఆ దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
Rahul Gandhi | బీజేపీని గద్దె దించుతాం
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ (BJP) ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ పార్టీని గద్దె దించడం కోసం ప్రతిపక్షాలను ఏకం చేస్తామన్నారు. బీజేపీ దేశ సంస్థాగత వ్యవస్థపై పూర్తిస్థాయి దాడి చేసి, దానిని తన రాజకీయ అధికారాన్ని పెంచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా దాడే అని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరిగినప్పుడు, ప్రతిపక్షం కేవలం ఎన్నికలలో సమస్య ఉందని చెప్పకుండా, దానిని ఎదుర్కోవడానికి మార్గాలను కనుగొనాలని రాహుల్ గాంధీ అన్నారు. తాము బీజేపీతో పోరాడటం లేదన్నారు. భారత సంస్థాగత నిర్మాణాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు.
భారత భారత ఎన్నికల యంత్రాంగంలో సమస్య ఉందని ఆయన ఆరోపించారు. కాగా రాహుల్ గాంధీ విదేశాల్లో భారత్, కేంద్ర ప్రభుత్వం (Central Government)పై విమర్శలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో సైతం ఆయన అనేక సందర్భాల్లో వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం, ఇతర అంశాలపై ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.