HomeUncategorizedRahul Gnadhi | ఓట్ల చోరీకి ఈసీ, బీజేపీ కుట్ర‌.. మ‌రోసారి రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌

Rahul Gnadhi | ఓట్ల చోరీకి ఈసీ, బీజేపీ కుట్ర‌.. మ‌రోసారి రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gnadhi | ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీ శుక్ర‌వారం మ‌రోసారి విమ‌ర్శించారు. బీజేపీ, ఎన్నిక‌ల సంఘం(Election Commission) క‌లిసి ఓట్ల చోరీకి కుట్ర ప‌న్నింద‌ని ఆరోపించారు. ఎన్నికల కమిషన్, బీజేపీపై ఆరోప‌ణ‌లు చేస్తూ శుక్రవారం Xలో ఒక వీడియోను పోస్టు చేశారు. భారత ఎన్నికల కమిషన్, బీజేపీ(BJP) “ఓట్లను దొంగిలించడానికి కుట్ర పన్నాయని” తన వాదనలకు మద్దతుగా ఆయన ఈ వీడియోను షేర్ చేశారు.

Rahul Gnadhi | రాజ్యంగం, ప్ర‌జాస్వామ్యంపై దాడి..

ఓట్ల చోరీతో ఎన్నిక‌ల సంఘం తీరు రాజ్యాంగాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న‌ద‌ని రాహుల్ ఆరోపించారు. తాజా ఉదాహరణగా ఉత్తరాఖండ్‌(Uttarakhand)ను ప్రస్తావిస్తూ, తాను గతంలో మాట్లాడిన మహారాష్ట్ర, హర్యానా కర్ణాటక రాష్ట్రాలను కూడా ఆయన ప్రస్తావించారు. “ఓటు చోరీ(దొంగతనం) కేవలం ఎన్నికల కుంభకోణం కాదు, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి చేసిన ఘోర ద్రోహం. దీనికి బాధ్యులైన వారు స్పష్టంగా వినాలి, కాలం మారుతుంది శిక్ష అనివార్యం” అని ఆయన హిందీలో రాశారు.

అయితే, రాహుల్‌గాంధీ(Rahul Gnadhi) గురువారం చేసిన ఆరోప‌ణ‌ల‌పై డిక్ల‌రేష‌న్ కింద స్ప‌ష్ట‌మైన ఆధారాలు ఇవ్వాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ కోరింది. దీనిపై ఆయ‌న తాజాగా స్పందించారు. “నా మాట ఒక ప్రమాణం” అని అన్నారు. తాజాగా పోస్టు చేసిన ఆ వీడియోలో, అతను ఒక రాజకీయ కుటుంబంలో పెరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. 1980లలో తాను, తన సోదరి ప్రియాంక, ఇంట్లో ఎన్నికల పోస్టర్లు తయారు చేసేవాళ్ల‌మ‌ని తెలిపాడు. “ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ బూత్‌లు, ఓటర్ల జాబితాలు. మధ్యలో ఉన్న ప్రతిదానిపై నాకు లోతైన అవగాహన ఉంది” అని వివ‌రించారు.