అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi | బీహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Congress leader Rahul Gandhi) ఓట్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
రాహుల్‌తో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (RJD leader Tejaswi Yadav), లోక్‌జన శక్తి (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చిందని తేజస్వి పాశ్వాన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్ జోక్యం చేసుకుంటూ అది తనకు కూడా వర్తిస్తుందేమో అనడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి.
Rahul Gandhi | నవ్వులే నవ్వులు..
“చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) కో సలాహ్ దేంగే కి వో అబ్ షాదీ కర్ లీన్ వో మేరే బడే భాయ్ హై” (చిరాగ్ పాశ్వాన్ నా అన్నయ్య కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోమని మేము సలహా ఇస్తాము) అని యాదవ్ అన్నారు. దీనికి స్పందించిన రాహుల్ గాంధీ, “యే తో మేరే ఉపర్ భీ అప్లై హోతా హై” (ఇది నాకు కూడా వర్తిస్తుంది) అని చమత్కరించారు. దీనిపై తేజస్వి స్పందిస్తూ.. “వో తో పాపా (లాలూ యాదవ్) కబ్ సే కెహ్ రహే హై ఆప్కో” (నా తండ్రి లాలూ యాదవ్ చాలా కాలంగా మీకు చెబుతున్నది అదే) అని గుర్తు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.