ePaper
More
    Homeక్రీడలుIndian Cricketers | ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ తీసుకున్న భారత లెజెండ్స్.. పుజారా నుంచి...

    Indian Cricketers | ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ తీసుకున్న భారత లెజెండ్స్.. పుజారా నుంచి కోహ్లీ వరకు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Cricketers | భారత క్రికెట్ చ‌రిత్ర‌లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక పేజి లిఖించుకున్న ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తున్నారు. అయితే ఈ లెజండ‌రీ ప్లేయ‌ర్స్‌కి ఫేర్‌వెల్ మ్యాచ్ (Farewell Match) లేకుండానే అంత‌ర్జాతీయ క్రికెట్​కు (International Cricket) గుడ్ బై చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అలాంటి ప్లేయ‌ర్స్ ఎవ‌రెవ‌రు అనేది చూస్తే..

    Indian Cricketers | చతేశ్వర్ పుజారా..

    2021లో పేలవ ఫామ్‌తో జట్టు నుంచి బయటకు వెళ్లిన పుజారా, కౌంటీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో మెరుపు సెంచరీ చేయడంతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ అదే ఫామ్ కొన‌సాగించ‌లేక‌పోవ‌డంతో పుజారా(Pujara)కి ఛాన్స్‌లు రాలేదు. దాంతో ఆయ‌న రీసెంట్‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఆయన ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌కుండానే రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది.

    Indian Cricketers | రాహుల్ ద్రావిడ్

    ‘ది వాల్’గా పేరుగాంచిన ద్రావిడ్(Rahul Dravid), 164 టెస్టులు, 344 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు, వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచిన ఆయన, 2012లో ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు.

    Indian Cricketers | వీరేంద్ర సెహ్వాగ్

    బలమైన అటాకింగ్ ఆటగాడిగా పేరుగాంచిన సెహ్వాగ్(Virender Sehwag), టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాటర్. కెరీర్ చివర్లో జట్టులో స్థానం కోల్పోయి, 2 సంవత్సరాల పాటు వెయిట్ చేసిన సెహ్వాగ్ చివరకు ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు.

    Indian Cricketers | యువరాజ్ సింగ్

    2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువీ(Yuvraj Singh), కెరీర్ చివర్లో చోటు కోల్పోయాడు. రీ ఎంట్రీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవ‌డంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగుల్లో ఆడడంతో ఫేర్‌వెల్ అవకాశమే లేకుండా పోయింది.

    Indian Cricketers | గౌతమ్ గంభీర్

    గంభీర్ (Gautam Gambhir) కూడా అంతర్జాతీయ స్థాయిలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడలేదు. అయితే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ద్వారా ఆటకు వీడ్కోలు చెప్పాడు.

    Indian Cricketers | జహీర్ ఖాన్

    భారత పేస్ దిగ్గజం జహీర్ ఖాన్(Zaheer Khan), 2014లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, 2015లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనికీ ఫేర్‌వెల్ మ్యాచ్ జరగలేదు.

    Indian Cricketers | హర్భజన్ సింగ్

    టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్ హర్భజన్ (Harbhajan Singh), 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు తీసి 2016లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఆట‌గాడు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌లేక‌పోయాడు.

    Indian Cricketers | మహేంద్ర సింగ్ ధోనీ

    భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ధోనీ (Ms Dhoni), 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో చివరి వన్డే ఆడి, 2020 ఆగస్టు 15న తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనికి కూడా ఫేర్‌వెల్ మ్యాచ్ జరగలేదు.

    Indian Cricketers | రవిచంద్రన్ అశ్విన్

    ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్(Ravichandran Ashwin), 765 అంతర్జాతీయ వికెట్లు సాధించిన తర్వాత, ఆకస్మికంగా ఆస్ట్రేలియా టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని రిటైర్మెంట్ అందరికీ షాకే.

    Indian Cricketers | విరాట్ కోహ్లీ

    ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కోహ్లీ (Virat Kohli), టెస్టుల్లో 10,000 పరుగులకు చేరువైన సమయంలో రిటైర్మెంట్(Retirement) ప్ర‌క‌టించ‌డం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2020 నుంచి 2025 మధ్యలో కేవలం 3 సెంచరీలే చేసాడు విరాట్‌. అయితే ఫామ్ లేమితో కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.

    ఈ ప్లేయర్లు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించినా, వారికి తగిన ఫేర్‌వెల్ మ్యాచ్ లభించకపోవడం అభిమానులను కొద్దిగా నిరాశపరిచింది. కానీ వారి ఆట , సాధించిన రికార్డులు ముందు ఏ ఫేర్‌వెల్ మ్యాచ్ స‌రిపోదు

    Latest articles

    Ration Shops | బియ్యం పంపిణీ పూర్తయినా కమీషన్ ఇవ్వరా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Shops | రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వకుండా వేధించడం...

    Heavy Rains | ఉత్తరాదిలో వర్షబీభత్సం.. పలువురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | ఉత్తర భారత దేశం (North India)లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    Chat GPT | చాట్​ జీపీటీ గుడ్​న్యూస్​.. 5 లక్షల మందికి ఉచిత యాక్సెస్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chat GPT | ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)​ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పలు రంగాల్లో...

    Bheemgal Police | డయల్ 100కు ఆకతాయి ఫోన్​.. చివరకు ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Police | డయల్​ 100కు ఫోన్​చేసి న్యూసెన్స్​ చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష...

    More like this

    Ration Shops | బియ్యం పంపిణీ పూర్తయినా కమీషన్ ఇవ్వరా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Shops | రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వకుండా వేధించడం...

    Heavy Rains | ఉత్తరాదిలో వర్షబీభత్సం.. పలువురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | ఉత్తర భారత దేశం (North India)లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    Chat GPT | చాట్​ జీపీటీ గుడ్​న్యూస్​.. 5 లక్షల మందికి ఉచిత యాక్సెస్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chat GPT | ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)​ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పలు రంగాల్లో...