102
అక్షరటుడే, భీమ్‌గల్: Panchayat Elections | రహత్ నగర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుపతి బుధవారం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను (PCC Cheif Mahesh Goud, ) కలిశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తన సొంత గ్రామమైన భీమ్‌గల్(Bheemgal) మండలం రహత్ నగర్లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా తిరుపతిని శాలువాతో సత్కరించారు. రహత్ నగర్ గ్రామం అభివృద్ధి కోసం సహకరించాలని ఈ సందర్భంగా నూతన సర్పంచ్ పీసీసీ అధ్యక్షుడిని కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. తిరుపతి వెంట మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం నాయకులు గోపాల్ నాయక్, సంగ్యా నాయక్ ఉన్నారు.