అక్షరటుడే, న్యూఢిల్లీ: Raha veer | రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారికి కేంద్రం అండగా నిలుస్తూ ప్రోత్సాహక నగదు అందజేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని నేరుగా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించేవారికి రూ. 25 వేల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇలా రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేవారిని కేంద్ర ప్రభుత్వం రాహవీర్ Raha veer గా గుర్తిస్తుందని Union Minister నితిన్ గడ్కరీ Nitin Gadkari పేర్కొన్నారు.
సాధారణంగా రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కొందరు జంకుతారు. ఎందుకంటే ఒకటి లీగల్ సమస్య. రెండోది పోలీసుల వేధింపులు. ఈ క్రమంలోనే గాలికి ఎగిరే కంపను మనమెందుకు తగిలించుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారిని సాయం చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
Raha veer | ఇతర ప్రయోజనాలు..
దీనికితోడు అదనపు ప్రయోజనాలు కూడా వివరించారు. ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షలకు వరకు క్యాష్‌లెస్ చికిత్స (ఏడు రోజులు) అందజేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక అంబులెన్సులు తేవడంతోపాటు ప్రమాద ప్రాంతానికి 10 నిమిషాల్లో చేరుకుని సేవలు అందించేలా ప్రణాళిక వేస్తున్నట్లు వెల్లడించారు. గోల్డెన్ అవర్ (critical సమయం) లో సహాయం చేయడం ద్వారా ఏటా ఎంతో మందిని కాపాడవచ్చని చెప్పారు.