అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda Medical College | నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను (first-year medical students) సీనియర్లు వేధించారు. దీంతో జూనియర్లు భయాందోళనకు గురి అవుతున్నారు.
రాష్ట్రంలో గతంలో ప్రతి కాలేజీలోనూ ర్యాగింగ్ ఉండేది. దీంతో చాలా మంది విద్యార్థులు కళాశాలకు వెళ్లడానికి భయపడేవారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో (engineering colleges) ర్యాగింగ్ అధికంగా ఉండేది. అయితే కొంతకాలంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో ర్యాగింగ్ తగ్గిపోయింది. ఇటీవల మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. వారం క్రితం నల్గొండ మెడికల్ కాలేజీలో (Nalgonda Medical College) ఫస్టియర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు. కాలేజీలో ఫిర్యాదు చేయడంతో తమపైనే కంప్లైట్ చేస్తారా అని బెదిరించారు. తాజాగా మరోసారి వారిని ర్యాగింగ్ చేశారు.
Nalgonda Medical College | పట్టించుకోని ప్రిన్సిపాల్
ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడంతో సీనియర్లు రెచ్చిపోయారు. మీ సంగతి చూస్తామంటూ జూనియర్లను హెచ్చరించారు. దీంతో ఫస్టియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ర్యాగింగ్ (ragging) సహజమే అంటూ ఆయన మాట్లాడినట్లు జూనియర్లు ఆరోపించారు. ‘‘వచ్చే ఏడాది మీరు కూడా సీనియర్లు అవుతారంటూ” ప్రిన్సిపాల్ సమాధానం చెప్పడం గమనార్హం. సీనియర్లకు ఇగో ఉంటుందని, ఈ విషయం పేరెంట్స్‌కు చెప్పొద్దని విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచించారు.
కాగా ర్యాగింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే నల్గొండ కలెక్టర్ త్రిపాఠి (Nalgonda Collector Tripathi) హెచ్చరించారు. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు వార్తలు రావడంతో ఆమె ఇటీవల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. వైద్య కళాశాలకు మెంటర్లను, యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
