141
అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad Police | నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా (Special Branch ACP) వి. రఘు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో రఘును ఈ స్థానంలో నియమించారు. ఆయన గతంలో బోధన్ (Bodhan) ఏసీపీగా పని చేశారు. అనంతరం అక్కడి నుంచి బదిలీపై హైదరాబాద్కు వెళ్లారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో పని చేశారు. త్వరలోనే ఎస్బీ ఏసీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.