Homeతాజావార్తలుRagging | ర్యాగింగ్​ కలకలం.. బీటెక్​ విద్యార్థి ఆత్మహత్య

Ragging | ర్యాగింగ్​ కలకలం.. బీటెక్​ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ragging | ర్యాగింగ్​ భూతం మళ్లీ విస్తరిస్తోంది. గతంలో ర్యాగింగ్​ అంటే విద్యార్థులు భయపడేవారు. ఇప్పుడు మళ్లీ జూనియర్లను వేధించడం ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది.

ర్యాగింగ్​ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. సీనియర్ల వేధింపులు తాళలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి తేజ్ (19) ఉప్పల్ – మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ(Siddhartha Engineering College)లో సెకండియర్​ చదువుతున్నాడు. నారపల్లిలోని మధు బాయ్స్​ హాస్టల్​లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. అయితే సాయితేజ్​ను ఆదివారం కొందరు సీనియర్లు ర్యాగింగ్​ చేశారు. సీనియర్లు మద్యం తాగమని ఒత్తిడి చేసి, బార్‌కు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక రూ.పది వేల బిల్​ కట్టమని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో అతడిపై దాడి చేశారు.

Ragging | మనస్తాపంతో..

సీనియర్లు వేధించడంతో మనస్తాపానికి గురైన సాయితేజ హాస్టల్​కు వచ్చి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనను సీనియర్లు కొట్టారని, ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ తండ్రికి వీడియో పంపాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు(Medipalli Police) ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా సోమవారం ఉదయం మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ వద్ద సాయితేజ్​ కుటుంబ సబ్యులు, బంధువులు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని, కాలేజీ యాజమాన్యం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.

Ragging | గతంలో కఠిన చర్యలు

రాష్ట్రంలో గతంలో ర్యాగింగ్(Ragging)​ తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా ఇంజినీరింగ్​, మెడికల్ కాలేజీల్లో సీనియర్లు ర్యాగింగ్​ పేరిట విద్యార్థులను వేధించేవారు. సరదా పేరిట చేసే ఈ వ్యవహారం తర్వాత తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం, కాలేజీ యాజమన్యాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. దీంతో 2010 తర్వాత ర్యాగింగ్​ తగ్గుముఖం పట్టింది. ర్యాగింగ్​ చేయాలంటే విద్యార్థుతు భయపడే పరిస్థితులు ఉండేవి. తాజాగా మళ్లీ స్మార్ట్​ఫోన్​, వెబ్​ సిరీస్​ల పుణ్యమ అని విద్యార్థులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ర్యాగింగ్ పేరిట జూనియర్లతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ర్యాగింగ్​ అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.

Must Read
Related News