Homeజిల్లాలుకామారెడ్డిLingampet | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల అసెంబ్లీ అబ్జర్వర్‌గా రఫీయొద్దీన్‌

Lingampet | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల అసెంబ్లీ అబ్జర్వర్‌గా రఫీయొద్దీన్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా రహమత్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతలు తనకు అప్పగించారని మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి రఫీయోద్దీన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షర టుడే, లింగంపేట: Lingampet | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నేపథ్యంలో అసెంబ్లీ అబ్జర్వర్‌గా లింగంపేటకు చెందిన కాంగ్రెస్‌ (Congress Party) మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి రఫీమొద్దీన్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా రహమత్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతలు తనకు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో నవీన్‌ యాదవ్‌ గెలుపు కోసం కృషి చేశానని, కామారెడ్డి అసెంబ్లీ అబ్జర్వర్‌గా, జహీరాబాద్‌ కో ఇన్‌ఛార్జిగా సైతం పార్టీ తనకు బాధ్యతలు అప్పగించిందని గుర్తు చేశారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యత మేరకు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​ మహేష్‌ కుమార్​ గౌడ్​, నేతలు నవాజ్, ఇమ్రాన్, ప్రతాప్‌ గిరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.