అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Ponguleti | రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడానికి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్చెరు కర్ధనూర్‌లో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించామన్నారు. మొదటి విడతలో వీటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా తాలిమ్‌లో చేపట్టిన భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇటీవల మేడ్చల్ జిల్లా (Medchal District)లో ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో చేపట్టే నిర్మాణాలకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy), ఎమ్మెల్సీ అంజి రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఫహిమ్ తదితరులు పాల్గొన్నారు.
Minister Ponguleti | మేడారంలో ఏర్పాట్లు చేయాలి
మేడారం మహాజాతర (Medaram Jathara)కు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఆయన సచివాలయం నుంచి మేడారంలో ఉన్న అధికారులతో మాట్లాడారు. తొలి రోజు కావడంతో భక్తుల సంఖ్య, సారలమ్మ వార్ల రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, జాతరలో నెలకొన్న పరిస్థితులు గురించి ఆరా తీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు,రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారును ఆదేశించారు.