అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Radhika Apte | సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ధైర్యమైన కామెంట్స్‌తో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే రాధికా, ఈసారి దక్షిణాది చిత్ర పరిశ్రమ (Film Industry)లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడారు.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సినిమాల్లో ఆకర్షణీయంగా కనిపించాలనే పేరుతో తనకు ఎదురైన ఇబ్బందులపై రాధికా ఆప్టే ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు తనకు ఛాతీ, పిరుదుల భాగంలో ప్యాడ్లు పెట్టుకోవాలని సూచించేవారని, అది చాలా అసౌకర్యంగా ఉండేదని తెలిపారు.
Radhika Apte | బరువు పెరిగాను..
అలాంటి మాటలు వినిపించినప్పుడు తీవ్రంగా కోపం వచ్చేదని చెప్పిన రాధికా, “మీ ఇంట్లో అమ్మ, చెల్లెళ్లకు కూడా ఇలాగే ఎక్కువ ప్యాడ్లు పెట్టమని చెబుతారా? అని అడగాలనిపించేది” అంటూ తన మనస్థితిని వెల్లడించారు. తన జీవితంలో ఎదురైన మరో బాధాకర సంఘటనను కూడా రాధికా పంచుకున్నారు. ఒక ట్రిప్ తర్వాత కేవలం నాలుగు కిలోల బరువు పెరిగినందుకే ‘లావుగా ఉన్నారు’ అని చెప్పి తనను ఓ సినిమా నుంచి తొలగించారని తెలిపారు. అంతేకాదు, తనను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ నుంచే తనను తప్పించారని, ఆ సినిమా తర్వాత పెద్ద హిట్‌గా నిలిచిందని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారు.
‘కబాలి’ (Kabali) వంటి భారీ చిత్రాల్లో నటించినప్పటికీ, దక్షిణాది పరిశ్రమలో తనకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని రాధికా ఆప్టే చెప్పారు. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేక సౌత్ సినిమాల్లో నటించాల్సి వచ్చిందని, అయితే ఆ సమయంలో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించారు.ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా రాధికా సౌత్ ఇండస్ట్రీ (South Industry)పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్న రాధికా, అప్పట్లో కొన్ని చిన్న పట్టణాల్లో షూటింగ్‌లు జరుగుతుండగా సెట్లో ఎక్కువగా మగవారే ఉండేవారని, అక్కడ తన శరీరాకృతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని తెలిపారు. ఆ రోజుల్లో షూటింగ్ సెట్స్‌పై ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని ఆమె అన్నారు.