అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raashii Khanna | అందాల చిన్నది రాశీ ఖన్నా (raashii khanna) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు స్లో అండ్ స్టడీగా సినిమాలు (slow and study movies) చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ (fans follwing) ఏర్పడింది. జోరు సినిమాతో మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటించడమే కాకుండా తన గాత్రంతో పాటపాడి అందరినీ మెప్పించింది. ఇక తర్వాత శివం, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, లవకుశ, వరల్డ్ ఫేమ్స్ లవర్, తొలి ప్రేమ, జిల్, పక్కా కమర్షియల్, జిల్ ఇలా చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా జోరు సినిమాతో మరింత ఫేమ్ సంపాదించుకుంది.
Raashii Khanna | ఏంటీ.. ఈ గాయాలు..
రాశీ ఖన్నా (raashii khanna) చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్, కోలీవుడ్ (bollywood and kollywood) చెక్కేసి అక్కడ వరస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లో చాలా బిజీగా ఉన్న ఈ చిన్నది ఏ మాత్రం సమయం దొరికినా చాలు తన కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి ఆసక్తి చూపుతుంటుంది. అలానే తన సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రాశీఖన్నా ఫర్జీ 2 అనే వెబ్ సిరీస్ (farzi 2 web series) చేస్తుంది. ఈ షూటింగ్‌లో రాశీ ఖన్నా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది.
రాశీ ఖన్నా (raashii khanna) గాయాలతో ఉన్న పిక్స్ షేర్ చేస్తే.. ఒక్కోసారి కథ డిమాండ్ చేస్తే గాయాలని కూడా లెక్క చేయదు. ఒక్కోసారి గాయాలు మీ శరీరం, శ్వాస మీద ప్రభావం చూపవచ్చు అంటూ పోస్ట్ పెట్టింది రాశీ ఖన్నా. షూటింగ్‌లో (shooting) రాశీ ఖన్నా చిన్న చిన్న గాయాలు తగిలించుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాశీ తెలుగులో ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో జొన్నలగడ్డ సిద్ధు (Jonnalagadda Siddhu) సరసన కథానాయికగా నటిస్తోంది. మరోవైపు కేజీఎఫ్ భామ శ్రీనిథి శెట్టి (srinithi shetty) కూడా హీరోయిన్‌గా చేస్తోంది.