Homeతాజావార్తలుRaashi Khanna | బాలీవుడ్‌కు చెక్కేస్తోన్న రాశీ ఖన్నా.. లవ్ స్టోరీలు రివీల్ చేసి షాకిచ్చిందిగా..!

Raashi Khanna | బాలీవుడ్‌కు చెక్కేస్తోన్న రాశీ ఖన్నా.. లవ్ స్టోరీలు రివీల్ చేసి షాకిచ్చిందిగా..!

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచిన అందాల భామ రాశీ ఖ‌న్నా. టాలీవుడ్‌లో యువ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం ఆమెకు అవకాశాలు కొంత తగ్గినట్టు కనిపిస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Raashi Khanna | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా (Raashi Khanna), ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ, వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యువ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసింది.

ఎన్టీఆర్‌తో ‘జై లవ కుశ’లో కూడా మెరిసిన ఈ భామ, తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఇటీవల అవకాశాలు కొద్దిగా తగ్గాయి.ఈ మధ్యే బాలీవుడ్‌లో (Bollywood) ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ హిందీ ఆడియెన్స్‌ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌కే ఫుల్ ఫోకస్ పెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Raashi Khanna | సీక్రెట్ ల‌వ్ స్టోరీస్..

ప్రస్తుతం ‘తెలుసు కదా’ (Thelusu Kada) అనే సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది రాశీ ఖ‌న్నా. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తాను రెండు సార్లు ప్రేమలో పడ్డానని రాశీ వెల్లడించింది. “ఒకసారి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందే, మరొసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రేమలో పడ్డాను,” అంటూ తన లవ్ స్టోరీలను షేర్ చేసింది. అయితే ఆ ప్రేమ కథలు ఎలాంటి ముగింపు పొందాయన్నది మాత్రం చెప్పకుండా, “ఇంకా ఆ ప్రేమ కొనసాగుతుందో లేదో చూడాలి” అంటూ మిస్టీరియస్‌గా స్పందించింది.

ఇక సోషల్ మీడియాలో (Social media) మాత్రం రాశీ ఖన్నా ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్ల మనసులు దోచేస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా తన గ్లామర్, టాలెంట్‌తో మేకర్స్‌ను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్న రాశీ.. మరి అక్కడ ఎంతవరకు సెటిల్ అవుతుందో చూడాలి. ఏదేమైన రాశీ ఖ‌న్నా త‌న ల‌వ్ స్టోరీ విష‌యంలో సీక్రెట్ మెయింటెయిన్ చేయ‌డం ఫ్యాన్స్ లో అనేక ఆలోచ‌న‌లు క‌లిగిస్తుంది. కొంప‌దీసి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోతో ప్రేమ‌లో ప‌డలే క‌దా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.