అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raaja Saab trailer | రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ది రాజా సాబ్ (The Raaja Saab) సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనుంది.
తాజాగా రాజా సాబ్ ట్రైలర్ (The Raja Saab trailer) విడుదల చేశారు. 3 నిమిషాల 34 సెకన్ల ట్రైలర్‌లో ప్రతి సీన్ కూడా ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రభాస్ స్టైలిష్ లుక్స్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, రొమాన్స్ అన్నీ కుదిరాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ని ఇలా చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోతున్నారు. ఈ సినిమా పక్కా హిట్ అనే కాన్ఫిడెంట్‌తో ఉన్నారు ఫ్యాన్స్.
Raaja Saab trailer | అద్దిరిపోయింది..
మారుతి Maruthi దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్, వింటేజ్ డార్లింగ్ స్టైల్ చూపిస్తారని దర్శకుడు హామీ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఎంతగానో అలరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రత్యేక స్క్రీనింగ్ కూడా ఉండనుంది. దీని ద్వారా అభిమానులలో ఉన్న హైప్ మరింత పెరుగుతుందని అంచనా. అలాగే అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే ‘కాంతార: ఏ లెజెండ్’ (Kantara: A Legend) సినిమాకు అటాచ్‌గా కొన్ని థియేటర్లలో ట్రైలర్ ప్లే కానుంది.
చిత్ర నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రకారం, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్రలో, ప్రభాస్ శీను, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. తాజాగా ట్రైలర్‌తో మూవీని సంక్రాంతి (Pongal) కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు కన్‌ఫాం చేశారు.