అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్‌లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు, బుర్ఖా (Quran books and burqas) పంపిణీ చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి సయ్యద్ ఖాజా నాజినుద్దీన్ సుల్తాన్ ఖాద్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడలో నడవాలని విద్యార్థులకు సూచించారు. అబ్దుల్ ఖాదర్ వెల్ఫేర్ సొసైటీ (Abdul Qadar Welfare Society) అధ్యక్షుడు సనా పటేల్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా విద్యార్థులకు ఖురాన్, బురఖా అందించినట్లు పేర్కొన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎండీ మాజీద్ ఉద్దీన్, అతిక్ హైమద్, విద్యార్థులు పాల్గొన్నారు.
