Homeజిల్లాలునిజామాబాద్​Balkonda Mandal | ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ అడ్మిషన్ల కోసం క్యూ

Balkonda Mandal | ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ అడ్మిషన్ల కోసం క్యూ

- Advertisement -

అక్షరటుడే బాల్కొండ: Balkonda Mandal | ఓపెన్​ ఎస్సెస్సీ, ఇంటర్​ అడ్మిషన్లు (Open SSC and Inter admissions) పొందేందుకు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు పదోతరగతి అయినా పాసైతే బాగుంటుందనే ఉద్దేశంతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ అధికారులు సైతం వారికి చదువుకోవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. గ్రామస్థాయిలో మహిళల్లో చైతన్యం రావడంతో అడ్మిషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో బాల్కొండలోని జిల్లా పరిషత్​ పాఠశాలలో (Zilla Parishad school) అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

ఈ మేరకు మంగళవారం ఒక్కరోజే సుమారు 33మంది విద్యార్థులు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్​ అడ్మిషన్లు తీసుకున్నారు. కార్యక్రమంలో బాల్కొండ ఎంఈవో బట్టు రాజేశ్వర్, ఐకేపీ ఏపీఎం గంగారాం, బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ పిల్లి గోపి, ఇన్​ఛార్జి హెచ్​ఎం ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.