అక్షరటుడే, వర్ని: Transco Nizamabad | రైతులు, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ రాపెల్లి రవీందర్ (Transco SE Rapelli Ravinder) పేర్కొన్నారు.
వర్ని మండలం (Varni mandal) కూనీపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అదనంగా 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంటర్ లింకింగ్ లైన్లు, కొత్త బ్రేకర్ల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జలాల్పూర్, జాకోరా ఉపకేంద్రాల్లో (Jalalpur and Zakora substations సాంకేతిక సమస్యలు వచ్చినా విద్యుత్ నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అత్యవసర సమయంలో టోల్‌ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. రైతులు (Farmers) ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్వయంగా ఫ్యూజ్‌లు మార్చవద్దని హెచ్చరించారు. జంపర్లు, లూజ్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లలో లోపాలు వంటి సమస్యలుంటే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈ ఆపరేషన్స్ బోధన్ ఎండీ ముక్తార్, డీఈ ఎంఆర్టీ నిజామాబాద్ వెంకటరమణ, రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్, ఏడీఈ టీఆర్ఈ నటరాజ్, వర్ని ఏఈ శ్రీనివాస్, సాయిలు, బాలకిషన్, వేణుగోపాల్, శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ సురేష్ బాబా, కూనిపూర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.