అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎరువుల డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్ (Yella Reddy CI Ravindra Nayak), ఎల్లారెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి నయీముద్దీన్ హెచ్చరించారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని విత్తన, ఎరువుల మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు పురుగు మందుల నాణ్యత, విక్రయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల యజమానులు కచ్చితంగా ఎరువుల లైసెన్స్ కలిగి ఉండాలని, ఎరువులు పీవోఎస్ మిషన్ (POS Missions) ద్వారానే విక్రయించాలని తెలిపారు. డీలర్లు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖకు (Department of Agriculture) రిపోర్టులు అందజేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్లు రోజువారీ అప్డేట్ చేయాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని.. విక్రయాల్లో డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.