Homeటెక్నాలజీStar Rating | స్టార్​ రేటింగ్​.. ఎప్పుడు, ఎందుకు ప్రారంభమైందో తెలుసా..!

Star Rating | స్టార్​ రేటింగ్​.. ఎప్పుడు, ఎందుకు ప్రారంభమైందో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Star Rating | సాధారణంగా ఏదైనా ఎలక్ట్రానిక్‌ వస్తువు(Electronic product)ను కొనేముందు ఆ వస్తువుకు ఏ స్టార్‌ రేటింగ్‌(Star rating) ఉందో గమనిస్తాం. మూడు అంతకన్నా ఎక్కువ రేటింగ్‌ ఉన్నవాటిని ఉంచుకుంటాం. ఇది ఎలక్ట్రానిక్‌ వస్తువులకే పరిమితం కాదు. సినిమాలకూ రేటింగ్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌(Online) సైట్‌లలో షాపింగ్‌ చేసేముందు కూడా ఆయా వస్తువుల రేటింగ్‌ను పరిశీలిస్తాం. అయితే ఇలా రేటింగ్‌ ఎందుకు ఇస్తారు, ఎవరు ఇస్తారన్న విషయాలు చాలా మందికి తెలియవు. స్టార్‌ రేటింగ్‌ గురించి తెలుసుకుందామా మరి..

ఒక ఉత్పత్తి యొక్క నాణ్యత(Quality), పనితీరు, విశ్వసనీయత తెలియజేయడానికి ఒక చిహ్నం అవసరం. స్టార్‌ను దీనికి చిహ్నంగా తీసుకుని ఉంటారు. అయితే స్టార్ నే ఎందుకు తీసుకున్నారు, ఇది ఎప్పుడు ప్రారంభమైందన్న విషయంపై స్పష్టత లేదు. స్టార్‌ రేటింగ్‌ గురించిన ఆలోచన మొదట సినీ ప్రపంచంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హోటళ్లు(Hotels), రెస్టారెంట్ల విషయంలో దీనిని వినియోగించారని భావిస్తున్నారు. కాగా 1900లో స్టార్‌ రేటింగ్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 20వ శతాబ్దం చివరి దశకంలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెజాన్‌, ఈబే వంటి ఈ కామర్స్‌(e-commerce) సంస్థలు తమ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయించే వస్తువులకు రేటింగ్‌ ఇవ్వడం ప్రారంభించాయి. 2000 తర్వాత ఎలక్ట్రానిక్‌ వస్తువులకు స్టార్‌ రేటింగ్‌ తప్పనిసరిగా మారింది. మన దేశంలో 2006 సంవత్సరంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ(Beauro of Energy Efficiency) సంస్థ ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మిషన్లు, టీవీలు, ఎల్‌ఈడీ బల్బులు, గీజర్లు, కూలర్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు రేటింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆయా వస్తువుల శక్తి సామర్థ్యాలను సూచించడానికి, ఎంత విద్యుత్‌(Power) ఖర్చవుతుందో తెలుసుకోవడానికి ఈ రేటింగ్‌ సిస్టమ్‌ ఉపయోగపడుతోంది. ఈ స్టార్‌ రేటింగ్‌ ఏ ఉత్పత్తి తక్కువ విద్యుత్‌ ఉపయోగిస్తుందో చెబుతుంది. తక్కువ విద్యుత్‌ బిల్లు రావాలంటే ఎక్కువ స్టార్‌ రేటింగ్‌ ఉన్న వస్తువును ఎంపిక చేసుకోవడమే ఉత్తమం.

Star Rating | రేటింగ్‌ ఎందుకంటే..

స్టార్‌ రేటింగ్‌ వస్తువు నాణ్యత, పనితీరు, డిజైన్‌ తదితరాలను సూచించే ఒక చిహ్నం లేదా సంఖ్య. ఇది వినియోగదారులలో ఆ ఉత్పత్తిపై నమ్మకాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. తయారీదారులు సైతం మార్కెట్‌లో వాటా(Market share)ను పెంచుకోవడానికి మంచి రేటింగ్‌ రావడం కోసం నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయి. రేటింగ్‌ సిస్టమ్‌లో సాధారణంగా 1 నుంచి 5 వరకు స్టార్లు ఉంటాయి. ఒక స్టార్‌(One star) ఉంటే అత్యల్ప నాణ్యతకు సూచికగా భావిస్తారు. అదే ఐదు స్టార్లుంటే అత్యుత్తమ నాణ్యత కలిగినదిగా భావిస్తారు.