Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్‌ ప్రాజెక్ట్​ను సందర్శించిన క్వాలిటీ కంట్రోల్‌ బృందం

Nizamsagar Project | నిజాంసాగర్‌ ప్రాజెక్ట్​ను సందర్శించిన క్వాలిటీ కంట్రోల్‌ బృందం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్‌: Nizamsagar Project | నిజాంసాగర్‌ ప్రాజెక్ట్​ను (Nizamsagar Project) క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల బృందం గురువారం సందర్శించింది.

ఈ సందర్భంగా చీఫ్‌ ఇంజినీర్‌ వెంకటకృష్ణ, ఈఎన్‌సీ శ్రీనివాస్‌ ప్రాజెక్ట్​ పరిస్థితిని పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వరద గేట్లు పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. గ్రీసింగ్, ఆయిల్, తదితర మరమ్మతులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్షన్‌లో (Quality Control Inspection) భాగంగా ప్రాజెక్ట్​ను సందర్శించినట్లు చెప్పారు. వారి వెంట ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ సోలోమాన్, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ భూమారెడ్డి, డీఈఈ దత్తాత్రేయ, ఏఈ శివకుమార్, సాకేత్‌ ఉన్నారు.