అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL | ఐపీఎల్(IPL)లో భాగంగా నేడు జరగాల్సిన క్వాలిఫైయర్ –2 (Qualifier) మ్యాచ్‌తో వరుణుడు దోబూచులాట ఆడుతున్నాడు. క్వాలిఫైయర్ –1 లో ఓడిన పంజాబ్ కింగ్స్(PBKS), ఎలిమినేటర్ గెలిచి ఊపు మీద ఉన్న ముంబయి ఇండియన్స్(MI) మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
వర్షం(Rain) కారణంగా మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. కాసేపటి క్రితం వర్షం పోవడంతో గ్రౌండ్ స్టాప్ కవర్లు తీసేసి గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. అయితే 8:26 గంటలకు మళ్లీ వర్షం పడటంతో గ్రౌండ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. 8:40 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించారు. వర్షం లేకపోవడంతో కవర్లు తీసేయాలని సూచించారు. అయితే 8:41 గంటలకు మళ్లీ వర్షం మొదలైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే మ్యాచ్ ఈ రోజు జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగపోతే రిజర్వ్ డే ఉంది. దీంతో రేపు మ్యాచ్ నిర్వహిస్తారు.