IPL 2025
IPL 2025 | క్వాలిఫైయర్​–2కు వరుణుడి ఆటంకం

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | రెండు నెలలుగా క్రికెట్​ ప్రేమికులకు ఎంతో మజానిచ్చిన ఐపీఎల్(IPL)​ ముగింపు దశకు చేరుకుంది. ఐపీఎల్​లో భాగంగా నేడు పంజాబ్​ కింగ్స్(PBKS)​, ముంబయి ఇండియన్స్ (MI)​ మధ్య మ్యాచ్​ ఉంది. అహ్మాదాబాద్​ (Ahmadabad)లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. అయితే మ్యాచ్​ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు నుంచి వర్షం ప్రారంభం అయింది. దీంతో మ్యాచ్​ ఇంకా ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం వర్షం తగ్గడంతో గ్రౌండ్​ స్టాఫ్‌ కవర్లు తొలగిస్తున్నారు. వర్షం తగ్గితే మ్యాచ్​ ప్రారంభించనున్నారు. వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్​ జరగకపోతే రిజర్వ్​ డే కేటాయించారు. దీంతో రేపు మ్యాచ్​ జరుగుతుంది. ప్రస్తుతం అహ్మాదాబాద్​లో వర్షం తగ్గడంతో మరి కొద్దిసేపట్లో మ్యాచ్​ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.