IPL Qualifier 1
Qualifier 1 | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఆర్సీబీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Qualifier 1 | క్రికెట్​ ప్రేమికులకు రెండు నెలల నుంచి ఎంతో మజానిచ్చిన ఐపీఎల్(IPL)​ చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్​లో భాగంగా నేడు తొలి క్వాలిఫైయర్(Qualifier 1)​ మ్యాచ్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూర్(RCB)​, పంజాబ్​ కింగ్స్(PBKS)​ మధ్య జరగనుంది. చంఢీగడ్​లో జరుగుతున్న ఈ మ్యాచ్​లో ఆర్సీబీ టాస్​ గెలిచి బౌలింగ్​​ ఎంచుకుంది. ఇందులో నెగ్గిన జట్టు ఫైనల్​కు వెళ్తుంది. ఓడిన జట్టు క్వాలిఫైయర్​–2లో ఆడుతుంది.