ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Khilla jail | స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి కేంద్రం ఖిల్లా జైలు

    Khilla jail | స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తి కేంద్రం ఖిల్లా జైలు

    Published on

    అక్షరటుడే ఇందూరు: Khilla jail | తెలంగాణలోని వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన కేంద్రం ఖిల్లా జైలు అని జిల్లా జైలు సూపరింటెండెంట్​ దశరథం (District Jail Superintendent Dasharath) తెలిపారు.

    దాశరథి కృష్ణమాచార్యుల (Dasarathi Krishnamacharya) శతజయంతి సందర్భంగా మంగళవారం ఖిల్లా రామాలయం కమిటీ ఆధ్వర్యంలో అప్పటి జైలు గదిలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్​ మాట్లాడుతూ.. దాశరథి తన కవిత్వాల ద్వారా లక్షలాది మందిలో ఉద్యమస్ఫూర్తిని నింపారని ‘నిజాం రాజు తరతరాల బూజు’ అని.. ‘ఓ నిజాం రాజు పిశాచమా.. కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడు..’ అంటూ పదునైన పదాలతో నైజాం గుండెల్లో నిద్రపోయిన మహాకవి అని కొనియాడారు.

    Khilla jail | ఖిల్లా రామాలయానికి ఘన చరిత్ర..

    ఖిల్లా రామాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని.. కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆలయ  కమిటీ గౌరవాధ్యక్షుడు ముక్కా దేవేందర్ గుప్తా ఆరోపించారు. సమాజమే చారిత్రక నిర్మాణాలను కాపాడుకొని, మన సంస్కృతి వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధి మారయ్య గౌడ్​, ఇతిహాస సంకల సమితి (Ithihasa Sankalana samithi) కార్య అధ్యక్షుడు మోహన్ దాస్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్, ఆనంద్, జిల్లా కార్యదర్శి డాక్టర్ మర్రిపల్లి భూపతి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Weightlifting Association | జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

    Latest articles

    Mopal | కులాస్​పూర్​లో దొంగల బీభత్సం.. పదిళ్లలో చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Mopal | మోపాల్​ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఏకంగా పదిళ్లలో...

    Sri Ram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్పంగా పెరిగిన ఇన్​ఫ్లో

    అక్షరటుడే, ఆర్మూర్ : Sri Ram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​(Sri Ram...

    Russia Plane Crash | రష్యాలో కూలిపోయిన విమానం.. 50 మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Russia Plane Crash | రష్యాలో విషాదం చోటు చేసుకుంది. అదృశ్యమైన అంగారా ఎయిర్​లైన్స్​...

    KTR | ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

    అక్షర టుడే నిజాంసాగర్: KTR | బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా...

    More like this