HomeUncategorizedTrump Tariffs | భార‌త్‌పై సుంకాల‌తో పుతిన్‌ను ఆప‌లేరు.. ట్రంప్ టారిఫ్‌ల‌పై డెమోక్రాటిక్ ప్యానెల్ విమ‌ర్శ‌

Trump Tariffs | భార‌త్‌పై సుంకాల‌తో పుతిన్‌ను ఆప‌లేరు.. ట్రంప్ టారిఫ్‌ల‌పై డెమోక్రాటిక్ ప్యానెల్ విమ‌ర్శ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంద‌న్న సాకుతో భారత్‌పై 50 శాతం సుంకం విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని US హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రటిక్ ప్యానెల్(Foreign Affairs Committee Democratic Panel) విమర్శించింది.

ఈ చర్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Putin)ను నిరోధించడానికి లేదా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏమాత్రం సహాయపడదని ప్యానెల్ పేర్కొంది. “భారతదేశంపై సుంకం విధించడం వల్ల పుతిన్‌ను ఆపలేరు. ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా అక్రమ దండయాత్రను ట్రంప్ నిజంగా పరిష్కరించాలనుకుంటే, అతను నేరుగా పుతిన్‌ను శిక్షించాలి. ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సహాయాన్ని అందించాని” ప్యానెల్ పేర్కొంది. భార‌త్‌పై ద్వితీయ సుంకాల గురించి అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్(US Treasury Secretary Scott Besant) హెచ్చరించిన నేప‌థ్యంలో ఈ వ్యాఖ్యలు రావ‌డం గ‌మ‌నార్హం.

Trump Tariffs | భార‌త్‌పై ట్రంప్ అక్క‌సు..

ర‌ష్యా(Russia) నుంచి చౌక‌గా చ‌మురు కొంటుందన్న అక్క‌సుతో ట్రంప్ భార‌త్‌పై క‌త్తిగ‌ట్టారు. రెండు విడుత‌ల్లో క‌లిపి 50 శాతం టారిఫ్ విధించారు. రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకున్నందుకు దీన్ని జరిమానాగా అభివర్ణించారు. ట్రంప్ నిర్ణయాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. టారిఫ్ విధింపు అన్యాయం, అసమంజసమ‌ని పేర్కొంది. మ‌రోవైపు, ట్రంప్ సుంకాల‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దీటుగా స్పందించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల విష‌యంలో ఎప్పుడూ రాజీపడదని అన్నారు. త‌మ‌కు వ్య‌క్తిగ‌తంగా, రాజకీయంగా నష్టం జరిగినా వెనుక‌డుగు వేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. “రైతుల ప్రయోజనాలే మా ప్రధాన ప్రాధాన్యత. రైతులు, పశువుల పెంపకందారులు. మత్స్యకారుల ప్రయోజనాల విష‌యంలో ఇండియా ఎప్పుడూ రాజీ పడదు. నేను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నానని” మోదీ ప్రకటించారు.