HomeUncategorizedPutin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) తన స్నేహితులతో మాట్లాడారు. సోమవారం (ఆగస్టు 18) భారత్​ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Indian Prime Minister Narendra Modi)కి ఫోన్​ చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం అలస్కా(Alaska)లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో చర్చించిన విషయాలను మోడీకి పుతిన్ వివరించారు. నేడు రాత్రి జెలెన్స్కీతో కలిసి యూరోపియన్ నాయకులు వాషింగ్టన్‌(Washington)లో ట్రంప్‌ను కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి పుతిన్​ కాల్​ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ మేరకు పుతిన్​ కాల్​ చేయడం, అలస్కా (Alaska) సమావేశంలో ట్రంప్​తో జరిగిన చర్చలను పంచుకోవడం తదితర వివరాలను ప్రధాని మోడీ సోషల్​ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా తన స్నేహితుడైన పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఉక్రెయిన్ వివాదంలో శాంతియుత పరిష్కారాన్ని భారత్​ కోరింది. ఈ విషయంలో చేసే ప్రయత్నాలకు భారత్​ మద్దతు ఉంటుందని మోడీ పునరుద్ఘాటించారు.

Putin calls Modi : పుతిన్​ ఎందుకు ఫోన్​ చేశారంటే..

జెలెన్స్కీ(Zelensky)తో కలిసి యూరోపియన్ నాయకులు (European leaders) ఈ రాత్రి వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవబోతున్నారు. భారత్​ – రష్యా స్నేహ బంధం, వాణిజ్య సహకారం నేపథ్యంలో.. ఇటీవల భారతదేశంపై యూఎస్​ భారీ సుంకాలు విధించింది.

రష్యా, ఉక్రెయిన్(Ukraine) ల మధ్య శాంతి నెలకొంటే.. భారత్​పై విధించిన యూఎస్​ సుంకాలకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రష్యాకు భారత్​ అతి పెద్ద భాగస్వామిగా ఉంది. రష్యాకు భారత్​ మంచి మిత్రదేశం కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్​తో జెలెన్స్కీ, యూరోపియన్ నాయకుల భేటీ తర్వాత తీసుకునే నిర్ణయాల వల్ల రష్యాతో పాటు భారత్​పైనా ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి పుతిన్​ ఫోన్​ చేసి మాట్లాడారు.